April 28, 2021
April 28, 2021
GV Nageswara Sastri garu and Mrs.
GV Annapoorna:
శ్రీమతి కస్తాల లక్ష్మీ గారికి,
నమస్కారములు.
మీ తండ్రి గారైన శ్రీ రాపాక భాస్కర రావు గారు స్వర్గస్తులైన వార్త విని భాదపడ్డాము.
భాస్కర రావు గారి నిండైన విగ్రహం, వస్త్రధారణ, ఆప్యాయంగా నవ్వుతో పలకరింపు ఆయనకే స్వంతం. రాపాక కుటుంబానికి ఆయన సమర్ధవంతమైన సారధి. మిమ్మలందరని ఈరోజు మీరు ఉన్న కక్ష్యలోకి ప్రవేశ పెట్టిన ధన్య జీవి. అన్ని తరాల వారితో సరదాగా కలసి అర్ధవంతముగా భాషించగల నేర్పరి.
కుటుంబం ఆయన కోట. ఆదరాభిమానాలు ఆయన ఆస్తులు. కొత్త Skoda కొన్న వెంటనే, దివ్య రాంగోలి రోజున మీచేత ప్రారంభిచారు. అది నేను ఎప్పటికి గుర్తుంచుకొంటాను.
తల్లి తండ్రుల దీవెనలు అసమానమైనవి. మీ అందరికి సదా అవి వెన్నంటి, మీ మున్ముందు పురోభివృద్ధికి దోహద పడతాయి అని నా నమ్మకం.
మీ తల్లితండ్రులు ఒక అపురూపమైన జంట. మీ అమ్మ గారికి ఈ పరిస్థితి చాలా బాధాకరంగా ఉంటుంది. కాల నిర్ణయం కాదననలేము. ఆవిడకి మీరందరూ బాసటగా ఉన్నారు. కాలగమనములో ఆవిడకి కొంత ఊరట కలగాలని నా కోరిక.
ప్రస్తుత పరిస్తులవల్ల వ్యక్తిగతముగా కలవలేకపోతున్నాను.
మీకు, శ్రీ సత్యనారాయణ గారికి, శ్రీ వెంకట రావు గారికి, మిగతా కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలియ జేస్తున్నాము.
నాగేశ్వర శాస్త్రి G V
అన్నపూర్ణ GV